-
- Avakaaya Audio
- Written by Raghothama Rao
- 24 May 2013
గత ఆరేళ్ళుగా అంతర్జాలంలో తెలుగు సాహిత్యానికి ఇతోధిక సేవ చేస్తూ, ఉపయోగకరమైన సమాచారాన్ని పొందుపరచడంలో కృషి చేస్తూ సాగుతున్న ఆవకాయ.కామ్ ప్రతి సంవత్సరం ఒక్కో కొత్త అంశాన్ని తనలో ఇముడ్చుకుంటూ ముందుకు సాగుతోంది. ఆ దిశగా ఈరోజు చిన్నపిల్లలకై ప్రత్యేకమైన ఆడియో బుక్ ను విడుదల చేస్తున్నాం.
ఆడియో బుక్స్ అన్నవి కొత్త విషయమేమీ కాదు. అలాగే ఆవకాయ.కామ్ లో పిల్లల కోసం ప్రత్యేక శీర్షికను నిర్వహిస్తూ వస్తున్నాం. ఆ శీర్షికకు మరిన్ని రంగులద్ది, ఈ వేసవి సెలవుల్లో పిల్లల మనోరంజనకై ఏదైనా కానుకను అందించాలన్న తపనతో ఈ ఆడియో బుక్ ను రూపొందించాం. ఈ కథకు మూల రచయిత ఎవరో తెలియదు. కానీ మా బృందం సభ్యుడి వద్దనున్న పుస్తకం ఆధారంగా ఈ ఆడియో బుక్ ను తయారుచేసాం. ఈ ఆడియో బుక్ ను ఆన్‍లైన్ లో వినడమే గాక డౌన్‍లోడ్ చేసుకోవచ్చును కూడా!
మేము ప్రవేశపెట్టిన ప్రతి శీర్షికనూ ఆదరించి, విజయవంతం చేసిన పాఠకులు, బాలల ఆడియో బుక్స్ ను కూడా ఆదరించి, ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.
ధన్యవాదాలతో
ఆవకాయ.కామ్ బృందం
వినండి....ఆవకాయ.కామ్ సమర్పిస్తున్న తొలి తెలుగు ఆడియో బుక్

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
- Member Categories - కథ చెప్పనా!
- Written by Hymavati Devi
- 23 May 2013
"ఇంటిలొ పాము దూరింది బాబోయ్ సాయానికి రండి...పాము పాము"అంటూ సోమిదేవమ్మ పెట్టిన కేకలు విని, వీధిలో వెళ్తున్నకరీం భాయ్ గోద పక్కనున్న కర్ర చేతిలో తీసుకుని "ఎక్కడ?ఎక్కడ?" అంటూ యింట్లోకి దూసుకెళ్ళాడు.
భయంతో బిక్క చచ్చి గోడకతుక్కుపోయి, నోట మాట రాక, పాము దూరిన వైపు చేయి చూపింది సోమిదేవమ్మ. పాతకాలం యిల్లు, పట్టపగలైనా వెలుతురు తక్కువగావుండి మసకగా వుంది.
ఏ సామాన్ల సందులో యిరుక్కుందో తెలియదు. ఎంత ప్రమాదమైన పామో తెలియదు. ఒక గది లోంచి వేరే గదిలో దూరిందా? వంటింటిలో ప్రవేశించిందా? పాపం ఒక్కామె యింట్లో వున్నట్టుంది అనుకుంటూనే కరీంభాయ్ "లైటు స్విచ్ ఎక్కడమ్మా?"అని అనగానే తన తల దగ్గరున్న స్విచ్ వేసింది సోమిదేవమ్మ.
ఆ గదిలో సామాన్లు ఎక్కువ లేవు కాబట్టి దాక్కొనే అవకాశం లేదు. పక్క బెడ్రూములో పెట్టెలు జరిపి, మంచం కింద చూశాడు. ఎక్కడా కనిపించ లేదు. ఇక వంటింటిలో దూరి వుంటుందనుకుని అక్కడా వెతకడానికి అడుగు ముందుకు వేశాడో లేదో
"ఆ! ఆ! లోపలికెళ్ళకు మడి వస్తువులన్నీ మైల పడిపోతాయి!" అన్న సోమిదేవమ్మ అరుపులు వినబడ్డాయి.
- Download eBooks - Short Stories-Poetry-Essays
- Written by Editor
- 21 May 2013
"సున్నితమైన స్వభావం, లోతైన అన్వేషణ, తగినంత అర్ద్రత, నిజాయితీ, చేసే పని ప్రాణం పెట్టి చేయటం, నచ్చనివాటిని తీవ్రంగా వ్యతిరేకించటం, లేదంటే వాటికి వీలైనంత దూరంగా ఉండటం, ఇతరులలో మరిన్ని మానవీయ విలువలు ఆశించి తరచూ నిస్పృహ చెందటం తన వ్యక్తిత్వంలో ముఖ్యమైన లక్షణాలుగా గమనించిన ప్రసాద్, సరైన కారణం తెలియని లోలోపలి వెలితి ఒకటి తన జీవిత గమనాన్ని శాసిస్తుందని భావిస్తారు. దానినే డిమాండ్ ఫర్ ఎక్సలెన్స్ అని కూడా అనుకోవచ్చునని, అది బహుశా అందరిలోనూ ఉంటుందని, దానిని గుర్తించే సున్నితత్వం, వ్యవధి, అంతర్ముఖీనత ఉండాలని అంటారు.
అనేక దేశకాలాలకు చెందిన జ్ఞానుల మాటలని వర్తమాన జీవితంతో సమన్వయించుకొంటూ, అధ్యయనం చేయటం మానవ వికాసానికి దోహదం చేస్తుందని భావించే ప్రసాద్, వ్యక్తీ-సమాజము, బుద్ధీ-హృదయమూ, జీవితమూ-అంతిమ సత్యమూ పరస్పర వ్యతిరేకాలు కావని, స్త్రీ-పురుష శక్తులవలే పరస్పర పూరకాలనీ, జాతుల, మతాల, ప్రాంతాల సంస్కృతుల సారాన్ని గ్రహిస్తూ, ఒక మహామానవ సంస్కృతి విస్తరించాలని, ఎవరి జీవితమని కాకుండా, అందరం మొత్తం జీవితం పట్ల బాధ్యత కలిగి స్పందించాలని, ఆలోచించాలని, వికసించాలని కలగంటారు.
సాహిత్యం పట్ల ప్రజలలో క్షీణిస్తున్న ఆసక్తీ, దానికి దారితీసిన ఉదాత్తత, నిజాయితీ లోపిస్తున్న సాహిత్యకారుల ఇరుకిరుకు వాదప్రతివాదాలూ, సాంకేతిక పరిణామాలూ, అనేక ఇతర కారణాల వల్ల పొడిబారుతున్న మానవ సంబంధాలూ; వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులూ - వీటన్నిటితో సృజనకు దూరంగా చాలా సంవత్సరాలు గడిచాక - జీవితం పట్ల మరింత స్పష్టతా, ఇష్టతా ఏర్పడుతున్న దశలో - క్షీణిస్తున్న మానవ విలువల పట్ల వ్య్దధచెందే అక్కడక్కడి మిత్రులను చూసి, ముఖ్యంగా కొందరికైనా తన మాటలు ఓదార్పునీ, స్పష్టతనీ, బలాన్నీ ఇవ్వటం గమనించి, తనకు అర్థమైన జీవితాన్ని ఇతరులతో పంచుకోవటం కోసం...’ఆకాశం’ సంకలనాన్ని" బి.వి.వి ప్రసాద్ గారు తీసుకొచ్చారు.
ఈ సంకలనానికి వ్రాసిన ముందుమాటలోని పై భాగాల్లో ప్రసాద్ గారి దృక్పథం, నిబద్ధత, అన్వేషణ మొదలైనవి తేటతెల్లమౌతాయి.
మేఘాల స్పర్శ, వానజల్లుల తడి, ఉరుముల అలజడి, మెరుపుల తళుకులు, తారల విలాసం, అమవస నిశినాటి చంద్రవిలాపం - ఎన్నెన్నో భావాల ఆకరమై, వంద కవితలతో ఆధునిక కవిత్వ శతకమైన "ఆకాశం" మీ చేతుల్లో ఉంచుతున్నాం.
ఈ సంకలనాన్ని ఈపుస్తకంగా ప్రచురించడానికి అనుమనినిచ్చిన బి.వి.వి. ప్రసాద్ గారికి ధన్యవాదాలు.
సాహిత్యాభినందనలతో
ఆవకాయ.కామ్ సంపాదక బృందం
- Member Categories - WoW
- Written by దుర్భిణి
- 20 May 2013
"నమస్కారాలు గురూ!"
"వెర్రోహం! ఇదేమిటి శిష్యా? ఎన్నడూ లేనిది కాళ్ళు పట్టి మరీ మస్కారాలు చెబుతున్నావ్! ఏదేనీ ఫిక్సింగాలోచనా?"
"అహో! మీరు మహాజ్ఞానులు...త్రికాలవేత్తులు...ఎన్న తరమా గురువు మహిమా వెర్రి గరిమా ఆహాహాహా!"
"ఇక ఆపు శిష్యా! పాయంటులోకి రా...ఐపీఎల్ అనబడే కంకాళ క్రీడ గురించేగా నీ వెర్రోహ సందేహ సందోహము? "
"అద్భుతం గురూ! మీ దృష్టి యొక్క పౌనఃపున్యము, తరంగదైర్ఘ్యము, వేగము....."
"హు..హు...హు...ఈ ఫిక్సింగు ఇక చాలు శిష్యా!"
"అవశ్యం గురూ! మీరన్నట్టుగా ఐపీఎల్ ఒక కంకాళ క్రీడయే కాదు డొంక లాగితే తీగ తెగే వ్యవహారంలా ఉంది. నాలాంటి వెర్రోహులు అనేకమంది వున్నారు. మీ విజ్ఞానోపదేశాన్ని విప్పి చెప్పి మమ్మల్ని ఉద్ధరించండి."
"అలాగే శిష్యా! మొదటగా ఫిక్సింగ్ పంకిలం అంటుకున్న ఆ ముగ్గురు కుర్రకుంక కంకాళాలలో ఒకడు అశాంతుడు, మరొకడు ఛండాలుడు మూడోవాడు చవట. అవునా!"
"శ్రీశాంత్, అజిత్ చండీలా మరియు అంకీత్ చవాన్ల రహస్యనామాలు విప్పి చెప్పారా గురూ! ధన్యోస్మి ధన్యోస్మి!"
"చూశావురా, ఈ కంకాళ మహిమంతా ఆ పేర్లలోనే దాగివుందిరా. ."
"ఆహా...దివ్యోపదేశము. మరి ఈ అస్థిపంజారాలపై బీసీసీఐ శ్రీనివాసుడు కనికరమును చూపెట్టాడెందుకు గురూ!"
"అక్కుపక్షీ! ఆ మాత్రం తెలుసుకోలేవుట్రా? అసలుకే మోసమొచ్చుననే ఈ అసందర్భ కనికార ప్రదర్శనము!"
"అర్థం కాలేదు గురూ!"
"అహో దుర్భరార్భకుడా! విను...అసలు ఈ ఐపీయెల్లే ఒక పెద్ద దగుల్బాజీ వ్యవహారం. దేశాన్ని ప్రతినిధింపజేసే ఒక అంతర్జాతీయ క్రీడలోకి ప్రాంతీయ విభేదాలు సృష్టించి, లేనిపోని అభిమానాల్ని చొప్పించి, ఐకమత్యాన్ని దెబ్బతీయించడంలో ఈ ఐపీఎల్ ఘనత వహించింది. ఆ మధ్యన జరిగిన బెంగళూరు-ముంబై ఆటలో విరాట్ కొహ్లి ముంబాయి ఇండియన్స్ అభిమానుల అతి చేష్టలను నిరసించలేదా? ఐపీఎల్ వచ్చేదాకా క్రికెటర్ల సంపాదనపై దేశప్రజలెవ్వరూ అంతగా దృష్టి పెట్టలేదు. ఈ ముదనష్టపు ఆట వచ్చాక ఏ ఆటగాడు ఎంతకు అమ్ముడుపోయాడన్న ఆరాలు తీయడంలోనే కాలం వ్యర్థమైపోతోంది. సంతలో పశువుల్ని అమ్మినట్టుగా ఆటగాళ్ళు అమ్ముడుపోతున్నారు. ఇలా మూలంలోనే అనేక జాడ్యాలు అంటుకొన్న ఈ మహమ్మారీ ఆటలో లంచాలు పుచ్చుకోవడంలో ఎలాంటి తప్పూ లేదు. అందుకనే ఈ శ్రీనివాసుడు నోరు కట్టేసుకొని దుష్టుల్ని క్షమించేసినట్టు పోజులు కొడుతున్నాడు."
"అమ్మయ్యోయ్...!"
"శిష్యా! బోర్ద్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అన్న వింతైన పేరున్న ఏకైక క్రికెట్ అథారిటీ BCCI మాత్రమే. ఇందులో రాజకీయుల అరాచక నియంత్రణ తప్ప క్రీడ పైన, దాని ఉన్నతి పైనా, ఆటగాళ్ళ నైతికతపైనా ఎలాంటి నియంత్రణలూ లేకపోవడమే దీని ప్రత్యేకత. బుకీలపైన మాకు నియంత్రణ లేదు అని సదరు శ్రీనివాసుడు నొక్కివక్కాణించడంలోనే అసలు విషయం ఉందిరా!"
"ఇకపై నేను క్రికెట్ మ్యాచులు చూడను గురూ!"
"పోరా వెర్రివాడా! ఈ ఆశ్రమాన్ని దాటి నీ డ్రాయింగు రూములోకి వెళ్ళేవరికేరా నీ క్రికెట్ వైరాగ్యం బ్రతికి బట్టకట్టేది. వందకోట్ల వెర్రిపుచ్చకాయలున్న ఈ దేశంలో కంకాళ క్రీడలు, కళంకిత క్రీడాకారులు బ్రతికిపోయి బట్టకట్టి వీరోచితంగా తిరుగుతూనేవుంటారు. దేశం ఏమైతేనేం, ఎటుపోతేనేం? ఫో! పోయి ఐపీఎల్ మ్యాచుల్లో మునుగు...చావు."
"గురూ! శపించకండి!"
"......."









Please wait...