The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 3
PoorBest 

ప్రపంచ ప్రసిద్ధి చెందిన వ్యక్తుల్లా పేరును సంపాదించాలని ఎవరైనా భావిస్తే, వారిలో మూడు లక్షణాలు ఉండాలి.

(1) స్పష్టమైన దృక్కోణం

(2) చిక్కుముడులు లేని ఆలోచనా విధానం

(3) అచంచలమైన దీక్ష.

కానీ వైరుధ్యాలకు లొంగిపోయే వ్యక్తులను ’జీవితం’ సంపూర్ణంగా కరుణించదు. ’నర్తించే నక్షత్రానికి జన్మనివ్వాలంటే నీలో ప్రళయం ఉండా”లని జర్మన్ తత్వవేత్త నీషే చెప్పాడట! మిత్రుడు మూలా సుబ్రహ్మమణ్యం ఈ మాటలను చాలా ప్రభావశీలంగా ఈ రచనలో వివరించారు.

సుబ్రహ్మణ్యం చెప్పినట్టు “వెలుగునివ్వాలంటే రగిలిపోవాలి.” నిజమే! కానీ ఆ ప్రయత్నంలో మసిబారిపోకూడదు. ఇక్కడ మసిబారడమంటే ద్వేషం, అసూయ, కక్ష మొదలైనవి రగిలే మనసుని బూడిదలా కప్పివేయడమన్నమాట! దృష్టిని మందగింపజేసే ఈ లక్షణాల వల్ల రకరకాల ప్రమాదాలు జరగవచ్చు. ఆ ప్రమాదాలు భౌతికమైనవి కావొచ్చు, మానసికమైనవి కావొచ్చు లేదా అదృష్టం బావోలేకపోతే రెండూ కావొచ్చు.

ఇటీవలి కాలంలో ఈ ’రగిలినా వెలగకుండానే మసైపోయిన’ మనసుకు వేముల రోహిత్ ఓ పర్యాయపదంగా మారాడు.

అతని చివరి ఉత్తరంగా వెలుగులోకివచ్చిన దాంట్లో రోహిత్ ఇలా వ్రాసాడు:

 

I always wanted to be a writer. A writer of science, like Carl Sagan. At last, this is the only letter I am getting to write.

I loved Science, Stars, Nature

కార్ల్ సేగన్లా తను కూడా ఓ రచయిత కావాలని, సైన్స్ అన్నా, నక్షత్రాలన్నా, ప్రకృతి అన్నా తనకెంతో మక్కువని వ్రాసుకున్నాడు రోహిత్.

అమెరికాకు చెందిన కార్ల్ సేగన్ను ఎందరో ఎన్నో విధాలుగా పొగిడారు. కార్ల్ వదిలి వెళ్ళిన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని, అతనొక ప్రజా ఖగోళ శాస్త్రవేత్త అని. ఇలా ప్రశంసలకు పాత్రుడైన కార్ల్ సేగన్ రోహిత్‍కు ఆదర్శంగా నిలచాడు. అయితే, రోహిత్ మాత్రం ఎవరో ఒకరు భర్తీ చేయగల స్థానాన్ని వదిలి తను ప్రేమించిన నక్షత్రాలను వేటాడుతూ వెళ్ళిపోయాడు.

ఈ సందర్భంలో కొద్దిగా అపహాస్యంగా అనిపించినా రోహిత్ ద్వేషించిన స్వామీ వివేకానంద మాటల్ని ఉదహరించదలిచాను.

 

 

“Whatever you think, that you will be. If you think yourself as weak, weak you will be; if you think yourself strong, strong you will be!”

’యద్భావం తద్భవతి’ అన్న ఆర్యోక్తిలా రోహిత్ ఓ బలహీనుడిగా మిగిలిపోయాడని అనిపించింది.

వృద్ధిలోకి రావలసిన యువకుడు అర్ధాంతరంగా నిష్క్రమించడాన్ని వివిధ కోణాలలో ఇప్పటిదాకా పలువురు చేసిన విశ్లేషణల్ని చదివాను.

ఓ దళితునిగా, ఓ దగాపడిన యువకునిగా, కాంపస్ రాజకీయాల్లో మునిగిపోయిన వ్యక్తిగా, దేశద్రోహి యాకూబ్ మెమన్ మద్దతుదారునిగా రోహిత్ ఇప్పటి దాకా పరిచయం కాబడ్డాడు. అలా విమర్శించిన వారెవరూ కూడా రోహిత్‍ను’కార్ల్ సేగన్’లా రచనలు చేయదల్చిన వానిగా  విశ్లేషించలేదు. సైన్స్ పాపులరైజర్‍గా ఎదగదలచిన రోహిత్ తన కలను నిజం చేసుకునే ప్రయత్నంలో ఎక్కడ దారి తప్పాడన్న లోపాలను ఎత్తి చూపలేదు. నా దృష్టిలో ఈ వయక్తిక కోణం చాలా అవసరం.

ఇప్పుడు మీరు చదువుతున్న ఈ వ్యాసంలో రోహిత్ కులమతాల గురించి గానీ, రాజకీయ కోణాల గురించి గానీ ఎలాంటి వ్యాఖ్యానాలను నేను చేయడం లేదు. బదులుగా, ఇందులో కార్ల్ సేగన్ – రోహిత్‍ల వ్యక్తిత్వాల సమిష్టి పరిశీలన, సార్వజనిక వేదికలపై అందుబాటులో ఉన్న వారి మాటలు, చేతలు, రచనల ద్వారా మాత్రమే ఈ విశ్లేషణను చేయడం జరిగింది.

ఈ క్రమంలో నాకు నేను వేసుకున్న ఒకేవొక ప్రశ్న – “కార్ల్ సేగన్ కావాలంటే ఏం చేయాలి?”

కార్ల్ సేగన్ కావాలంటే మొదటగా అతను ఎవరు? ఏం చేసాడు? అన్న విషయాలను సంక్షిప్తంగానైనా తెలుసుకోవాలి.

కార్ల్ సేగన్ – యథాతథంగా:

కార్ల్ సేగన్ అమెరికాకు చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త, పరిశోధకుడు, రచయిత, డాక్యుమెంటరీ నిర్మాత. అన్నిటికంటే ముఖ్యంగా అతనొక మనసున్న మానవుడు. 1935లో పుట్టి 1997లో మరణించాడు.

యువతరంలో సైన్స్ పట్ల ఆసక్తిని, అభిరుచిని కలిగించేందుకు అనేక రచనల్ని చేసాడు. వాటిలో నేను కేవలం మూడు పుస్తకాలను మాత్రమే చదివాను. అవి ఏవంటే కాస్‍మోస్, బిలియన్స్ & బిలియన్స్ మరియు డీమన్ హాంటెడ్ వర్ల్‍డ్. ఈ మూడు పుస్తకాలలో నాకు అర్థమయిన కార్ల్ సేగన్ గురించి మాత్రమే నేను ఇక్కడ వివరిస్తున్నాను. ఆ కార్ల్ సేగన్ తో మాత్రమే రోహిత్‍న్ పోల్చి చూపిస్తున్నాను. [ఇందులో ఏవైనా లోపాలు, దోషాలు ఉంటే విజ్ఞులైన చదువరులు వాటిని నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను.]

నా దృష్టిలో కార్ల్ అభిరుచివున్న శాస్త్రవేత్త. ప్రాచీన సమాజాలన్నా, పాత ఆచారాలన్నా, గతకాలపు నమ్మకాలన్నా ఏమాత్రం ద్వేషం లేని పరిశోధకుడు. నేను చదివిన మూడు పుస్తకాలలో ఎక్కడా అతను మతాలను గానీ, వాటి పద్ధతులు, విశ్వాసాలను గానీ అపహాస్యం చేయగా చూడలేదు. పేరుపొందిన పరిశోధకుడు గనుక పాత పద్ధతుల్ని గేలి చేసి తీరాలన్న మూర్ఖత్వం లేని వాడు. ఈ చిల్లర పనుల కన్నా “క్రొత్త పాతల మేలుకలయిక క్రొమ్మెరుంగులు చిమ్మగా” అన్న గురజాడ మాటల్ని అక్షరాలా పాటించిన సహృదయుడు.

ఒప్పే చేసారో, తప్పే చేసారో చరిత్రలో గతించిన వారందరూ మన సమిష్టి పూర్వీకులే. ఆనాటికి వారు ఎంతవరకు ఆలోచించగలిగారో, ఆచరించగలిగారో, అంతవరకే వారిని పరిగణించాలి. ఈనాటి కొలమానాలతో ప్రాచీనుల్ని విమర్శించడం, అపహాస్యం చేయడం నాకు నచ్చని విషయం. ఇందుకే కాబోలు నాకు కార్ల్ సేగన్ వ్యవహార శైలి నచ్చింది. పాత పద్ధతులు, మతాచారాల పట్ల కార్ల్ పాటించిన సంయమనం యువతరానికి ఓ చక్కటి సందేశాన్నిచ్చే నడవడిక అని చెప్పగలను.

కార్ల్ వ్యక్తిగతంగా అజ్ఞేయవాది అట! కానీ ప్రపంచం అతన్ని నాస్తికునిగా పిలిచింది. అతనే చెప్పుకున్నట్టుగా కార్ల్ ఒక ’సంశయవాది.’ సంప్రదాయం చెప్పే ప్రతి అంశాన్నీ అనుమానించి, హేతువాద పునాదిపై విమర్శించడం అతనికి అలవాటు. కానీ నేను చదివిన మూడు పుస్తకాల్లో అతని విమర్శ ఎక్కడా హద్దులు మీరలేదు.

మయన్ నాగరికత, భారతీయ సంస్కృతి, మీసోఅమెరికన్ సమాజాలు – ఇవేవీ కూడా అతని పుస్తకాల్లో హేళను గురి కాలేదు. బదులుగా, అవన్నీ కార్ల్ సేగన్ విశ్లేషణతో కొత్త రంగుల్ని సంతరించుకున్నాయి.

ఉదాహరణకు, చోళుల కాలం నాటి ఓ నటరాజ విగ్రహంపై “కాస్మోస్” పుస్తకంలో కార్ల్ చేసిన ఈ క్రింది విశ్లేషణను చదవండి:

In India there are many gods, and each god has many manifestations. The Chola bronzes, cast in the eleventh century, include several different incarnations of the god Shiva. The most elegant and sublime of these is a representation of the creation of the universe at the beginning of each cosmic cycle, a motif known as the cosmic dance of Shiva. The god, called in this manifestation Nataraja, the Dance King, has four hands. In the upper right hand is a drum whose sound is the sound of creation. In the upper left hand is a tongue of flame, a reminder that the universe, now newly created, will billions of years from now be utterly destroyed. These profound and lovely images are, I like to imagine, a kind of premonition of modern astronomical ideas.

 

అదేవిధంగా, ’నిత్యాగ్ని’ సంప్రదాయంను ఆధునిక కాలంలోని పద్ధతులతో అతను అనుసంధానించిన తీరు కూడా గమనార్హమైనదే:

Every home in ancient Greece and Rome and among the Brahmans of ancient India had a hearth and a set of prescribed rules for caring for the flame. At night the coals were covered with ashes for insulation; in the morning twigs were added to revive the flame. The death of the flame in the hearth was considered synonymous with the death of the

family. In all three cultures, the hearth ritual was connected with the worship of ancestors. This is the origin of the eternal flame, a symbol still widely employed in religious, memorial, political and athletic ceremonials throughout the world.

అలాగని, కార్ల్ గతకాలాన్ని గుడ్డిగా ప్రేమించే ప్రేమికుడు కాడు. ప్రాచీన సమాజాలు ఎక్కడ ఆగిపోయాయి, ఎలా దిశను మార్చుకోలేకపోయాయో విస్పష్టంగా చెప్పగలిగాడు. ఉదాహరణకు ’కాస్మోస్’ పుస్తకంలో ’ది బ్యాక్‍బోన్ ఆఫ్ నైట్’ అన్న అధ్యాయంలో ప్రాచీన భారత, చైనాల గురించి ఇలా వ్యాఖ్యానించాడు:

China and India and Mesoamerica would, I think, have tumbled to science too, if only they had been given a little more time.

ఇక్కడితో ఆగకుండా, భారతీయ సంస్కృతి అనే పేరుతో చలామణి అవుతున్న కొన్ని ’అవైజ్ఞానిక’ పద్ధతుల్ని సున్నితంగాను, నేరుగానూ విమర్శించాడు. ఉదాహరణకు “ది డీమన్ హాంటెడ్ వర్ల్‍డ్” అనే పుస్తకంలో ’ది మోస్ట్ ప్రెషియస్ థింగ్’ అనే అధ్యాయంలో భారతదేశానికి చెందిన మహర్షి మహేష్ యోగి గురించి, అతను ప్రవేశపెట్టిన ట్రాన్సన్‍డెంటల్ మెడిటేషన్ గురించి ఇలా అన్నాడు:

Perhaps the most successful recent global pseudoscience – by many criteria, already a religion - is the Hindu doctrine of transcendental meditation (TM). The soporific homilies of its founder and spiritual leader, the Maharishi Mahesh Yogi, can be seen on television in America. Seated in the yogi position, his white hair here and there flecked with black, surrounded by garlands and floral offerings, he has a look. One day while channel surfing we came upon this visage. 'You know who that is?' asked our four-year-old son. 'God.' The worldwide TM organization has an estimated valuation of $3 billion. For a fee they promise through meditation to be able to walk you through walls, to make you invisible, to enable you to fly. By thinking in unison they have, they say, diminished the crime rate in Washington DC and caused the collapse of the Soviet Union, among other secular miracles. Not one smattering of real evidence has been offered for any such claims. TM sells folk medicine, runs trading companies, medical clinics and 'research' universities, and has unsuccessfully entered politics. In its oddly charismatic leader, its promise of community, and the offer of magical powers in exchange for money and fervent belief, it is typical of many pseudosciences marketed for sacerdotal export.

 పైవాటి ఆధారంగా, కార్ల్ సేగన్ అకారణ ద్వేషం లేని ఉదారశీలిగా కనబడతాడు. ఈ లక్షణమే అతన్ని విలక్షణ ’నాస్తిక’ శాస్త్రవేత్తగా గుర్తింపు పొందడానికి దోహదపడింది. ఈనాటి యువ పరిశోధకులు కార్ల్ ఆచరించి, చూపిన ఈ సల్లక్షణాన్ని మనస్పూర్తిగా అందుకునే ప్రయత్నం చేయాలి.

ప్రాచీన భారతదేశం, సనాతన ధర్మం – కార్ల్ సేగన్:

ఏ విద్యార్థి అయినా నిజమైన మేధావిగా ఎదగాలంటే ద్వేషరహితమైన బుద్ధి, సౌహార్ద్రత ఉండాలి. ఇటువంటి సందర్భంలోనే కార్ల్ సేగన్ ఒక చక్కటి ఉదాహరణగా కనిపిస్తాడు. నేను చదివిన మూడు పుస్తకాలలో అతను ఉటంకించిన భారతీయ, ఐరోపా, ఉత్తర-దక్షిణ అమెరికా సంస్కృతులు, జాతులు, పద్ధతులు, ఆచారాలలో ఒకదాని పట్ల అభిమానం, మరొకదాని పట్ల (ప్రత్యక్షమైన లేక పరోక్షమైన) ద్వేషం చూపలేదు.

ముఖ్యంగా ప్రాచీన భారతదేశం, వైదిక సంస్కృతి, సాహిత్యం, కళల పట్ల కార్ల్‍కు గల అభిప్రాయాలను తెలుసుకోగోరేవారు ఈ క్రింది లింక్స్‍ను చూడగలరు. ఇందులో మొదటిది రెడిఫ్.కామ్ లో ప్రచురితమైన ఇంటర్వ్యూ, రెండవది కార్ల్ రూపొందించిన టెలివిజన్ ధారావాహిక “కాస్మోస్”లో భారతదేశంపై తీసిన ఎపిసోడ్ ఉన్నాయి. ఇవి స్వయం వ్యాఖ్యానితాలు గనుక నేను వాటిని పునరావృతం చేయడం లేదు.

http://www.rediff.com/news/jan/29sagan.htm

 

https://www.youtube.com/watch?v=Ugyrzr5Ds8o

అయితే, రోహిత్ ఇందుకు వ్యతిరేకంగా కనిపిస్తాడు. సూడో సెక్యులరిజమ్‍కు లొంగిపోయిన వానిగా కనిపిస్తాడు. ’అంబేద్కరిజమ్’ అన్న పేరు క్రింద అంబేద్కర్ అభిప్రాయాలలో కొన్నింటిని మాత్రమే పాక్షికంగా తెలుసుకుని అదే సంపూర్ణమయిన సిద్ధాంతంగా భ్రమపడినవాడిగా అగుపిస్తాడు.

రోహిత్ ఫేస్‍బుక్ ప్రొఫైల్లో చేసిన వ్యాఖ్యానాలను అతని సోషియల్ బిహేవియర్‍కు సూచికలని పరిగణిస్తే, మొదటి వ్యాఖ్యలకు చివరి వ్యాఖ్యలకు ఎంతో తేడా కనిపిస్తుంది. ఈ పరిణామక్రమం అభ్యుదయపూర్వకంగా లేదన్నది నా అభిప్రాయం. ఆవిధంగా, రోహిత్ తన చుట్టూ తానే ఓ సాలెగూడును నిర్మించుకుని అందులో చిక్కుకుపోయాడు.

ప్రతిష్టాత్మకమైన ఓ యూనివర్సిటీలో చదువుతున్న పరిశోధక విద్యార్థిగా తన అధ్యయనాన్ని సాగించడానికి ఇతరులకు ఉన్నన్ని అవకాశాలే రోహిత్‍కు కూడా ఉన్నాయి. తన అధ్యయనంలో భాగంగా భారతదేశానికి చెందిన అంశాల పట్ల ఇష్టాన్ని, అయిష్టతను, సానుకూలతను, వ్యతిరేకతను, ఇంకా ఎన్నో రకాలైన అభిప్రాయాలను వెలిబుచ్చడానికి నాకు, మీకు ఉన్నట్టుగానే అతనికీ మార్గాలు ఉన్నాయి. ఒకవేళ అతనికి వైదిక సంస్కృతి పట్ల అభ్యంతరాలు ఉండివుంటే వాటిని కంచె ఐలయ్యలా పుస్తకాల రూపంలోనో, ప్రసంగాల రూపంలో వ్యక్తపరచడానికి అన్ని వెసులుబాట్లూ ఉన్నాయి. మతం పట్ల, ఆచారాల పట్ల బాహాటంగా వ్యతిరేకతను వ్యక్తం చేసిన అవిజిత్ రాయ్, అనంత బిజొయ్ దాస్ అనే ఇద్దరు బాంగ్లాదేశ్ నాస్తికుల్లా మారణాంతిక దాడులకు గురయ్యే సందర్భం ఈ స్వేచ్ఛా భారతంలో అతనికి ఎదురయ్యేది కాదు.

కానీ, అలా జరగలేదు. రోహిత్ తాను అల్లుకున్న అయోమయపు ఇజాల గూటిలో ఇరుక్కుపోయాడు. నక్షత్రాల గురించి పుస్తకాలు వ్రాయాలనుకున్న వాడు ’నక్షత్రాలకేసి వెళ్తున్నా’ననే మరణపత్రాన్ని మాత్రమే వ్రాసాడు.

రోహిత్‍ లాంటి సోషియాలజీ పరిశోధకులకు సహనం అనే గుణం ఉండాలి. విస్తృతమయిన సంస్కృతులను అధ్యయనం చేయడం సులువైన ప్రక్రియ కాదు. ఇప్పటికీ సజీవంగా ఉండే సంస్కృతులను గానీ లేక కనుమరుగయినవాటిని గానీ అధ్యయనం చేసేప్పుడు సహనం, సౌహార్ద్రత, నిష్పాక్షికత వంటి లక్షణాలు మరింతగా ఉపయోగపడతాయి. అలా కాకుండా, ఒక మతాన్ని కానీ, జాతిని కానీ లేక దేశాన్నీ కానీ ద్వేషిస్తూవుంటే అటువంటి విద్యార్థులు తమ అధ్యయనానికి సరైన న్యాయం చేయలేరు.

రోహిత్ చనిపోయిన 24 గంటల్లో వెలుగు చూసిన ఈ వీడియో హిందూ మతం పట్ల, కాషాయ వర్ణం పట్ల అతనికి గల వ్యతిరేకత తెలియజేసింది.

https://www.youtube.com/watch?v=sbOGvkZUhN8

 ఇక్కడ ఒకమారు రెడిఫ్.కామ్‍లో ప్రచురితమైన కార్ల్ సేగన్ ముఖాముఖిని గుర్తుకు తెచ్చుకోవడం సముచితం. ఆ ఇంటర్వూను నిర్వహించింది ఒక గోవా క్రిస్టియన్ (ప్లాసిడో పి. డిసుజా). సమాధానాలు ఇచ్చింది నాస్తికునిగా మారిన ఒక అమెరికన్ యూదు (కార్ల్ సేగన్). అంటే ఇద్దరు పర మతస్థులు శాస్త్రవేత్త భారతదేశాన్ని, గుడులను, సంక్రాంతి వంటి పండుగలను చర్చించడమే గాక  వైదిక సంస్కృతిలో సృష్టి యొక్క వయస్సును లెక్కగట్టిన విధానాన్ని పొగడ్డం కనబడుతుంది.

ఇద్దరు పర మతస్థులకున్న ఆపాటి సహనం రోహిత్‍లో ఎందుకు కొరవడింది? నాస్తికుడయినా కార్ల్ సేగన్ పురాణాలలోని సృష్టి ప్రకరణాన్ని “right time scale” అని గుర్తించి, గౌరవించాడన్న విషయాన్ని రోహిత్ ఎందుకు గమనించలేదు? తన మాటల్ని ఫిల్మ్ చేస్తున్నారని తెలిసి కూడా రోహిత్ సంయమనాన్ని ఎందుకు పాటించలేదు? సోషియాలజీని అధ్యయనం చేసే క్రమంలో, కార్ల్ సేగన్లా రచనలు చేయదల్చిన విద్యార్థికి ’బ్రాహ్మణ ద్వేషం’ సహాయపడుతుందని రోహిత్ ఎలా భావించగలిగాడు? నిజానికి ’చదువు’కు, ’కులా’నికి ముడిపెడుతూనే ఎందుకు చదవాలి? అలా స్వేచ్ఛగా రోహిత్‍ను చదవనీయకుండా అతని కళ్ళకు ’ఇజా’ల గంతల్ని కట్టిందెవరు? చరకుడు, ఆర్యభట, చాణక్య, కాళిదాసు, ఆనందవర్ధనుడు మొదలైన వారు బ్రాహ్మణులు కాబట్టి వారి రచనల్ని ద్వేషించాలా? ఇలా ద్వేషిస్తూ పోతే మనకు మిగిలేదేమిటి?

గొప్ప రచనల్ని చేయదలచిన వారికి ఉండవలసిన మరొక ప్రాథమిక గుణం ఏమిటంటే – దోషరహితమైన తర్కం. రోహిత్ ఆ గుణాన్ని సాధించకుండానే వెళ్ళిపోయాడు. ఈ మాట ఎందుకంటున్నానంటే - హిందూత్వవాదులు వివేకానందుణ్ణి ఓ వ్యూహం ప్రకారం గొప్పవాణ్ణి చేసారన్నది రోహిత్ వాదం. మరి అంబేద్కర్ పరిస్థితి ఏమిటి? రాజ్యాంగ రచనకు ఏర్పడిన ఎన్నో కమిటీల్లో ఒకానొక కమిటీకి ఛైర్మన్‍గా వ్యవహరించిన అంబేద్కర్ ఒక్కడినే ’భారత రాజ్యాంగ నిర్మాత’ అని ప్రచారం చేయడం ఎందుకు? ఇది కూడా ‘institutionalization’ కాదా? ప్రతిభ ఆధారంగా సీట్ సంపాదించుకున్న రోహిత్‍లో తర్కరాహిత్యం ఎందుకు ఏర్పడింది? తర్కరహితంగా ఆలోచించడమే గొప్ప విషయమన్న తప్పుడు అభిప్రాయాన్ని అతనిలో ఎవరు కలిగించారు?

ఇవన్నీ అందరూ కలసికట్టుగా, గంభీరంగా ఆలోచించవలసిన ప్రశ్నలని నా అభిప్రాయం.

ఏదియేమైనా రోహిత్ తనకు తానుగా కట్టుకున్న ఇజాల గోడలే అతన్ని బలి తీసుకున్నాయి. అతను తనకు తానుగా కళ్ళకు బిగించుకున్న ’ద్వేషం’ గంతలే దారిని తప్పించి, వెళ్ళకూడని దారిలో తీసుకెళ్ళాయి. ’దళిత మేధావి’గా పత్రికలు చిత్రీకరించిన రోహిత్ మేధావితనానికి అతని ఆత్మహత్య ఓ మచ్చలాంటిది.

ఇది సత్యం!

ఒక మేధావంతుడైన విద్యార్థి మరణాన్ని శాస్త్రీయమైన పద్ధతిలో విశ్లేషించకుండా కొందరు ప్రమాదకరమైన వ్యాఖ్యల్ని ప్రచారం చేస్తున్నారు. ఉదాహరణకు ఈ క్రింది వ్యాఖ్యను చూడండి:

రోహిత్ ఆత్మహత్య తరువాత రవికుమార్ ఫేస్‍బుక్ లో వ్రాస్తున్న దాదాపు అన్ని వ్యాఖ్యల్ని నేను గమనించాను. అతని వ్యాఖ్యలపై వచ్చిన కామెంట్స్‍ను చదివాను. అవన్నీ రెచ్చగొట్టేవిగానే ఉన్నాయి. తలాతోకాలేని “బ్రాహ్మిణిజమ్”, “మనువాదం” వంటివి రోహిత్ మరణానికి కారణాలని విషప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఇలా హింసను ప్రేరేపించే మాటల్ని వాడుతున్నారు. ఒక మేధావి మరణాన్ని అశాంతి రేకెత్తించడానికి వాడుకుంటున్న ఈ ధోరణి ప్రమాదరమైనది.

దీనికి తోడు పెంపుడు పిల్లి ఈనితే చాలు కవిత్వాలు వ్రాసేవారున్న ఈ కాలంలో కొందరు కవులు(!) ఇప్పటికే రోహిత్ పై కవితల్ని వ్రాయడం, వాటిల్ని ఓ సంకలనంగా తీసుకుని రావడానికి ఏర్పాట్లు చేయడం, సమాజోద్ధారం పేరుతో తమ స్వార్థపర పేరుప్రఖ్యాతల్ని పెంచుకొనజూసే వారు ముందు మాటలు, వెనక మాటలు వ్రాసేయడం జరిగిపోతున్నాయి.

వారి ప్రయత్నాలు ఎలా పోయినా ఫరవాలేదు గానీ ఆత్మహత్యలాంటి పిరికి చర్యను ధీరోదాత్తమైనదిగానో లేక తలాతోకాలేని ’బ్రాహ్మణిజమ్’ చేసిన హత్యగానో చిత్రీకరించే ఏ ప్రయత్నానైనా ఉపకారం కంటే అపకారాన్నే చేస్తుందన్న నిష్టుర సత్యాన్ని అందరూ గుర్తించాలి.

ఇప్పుడు మనం చేయవలసిన తక్షణ కర్తవ్యం ఒకర్ని చంపడం కాదు, కవిత్వాలు వ్రాయడం కాదు – చదువుకోవాల్సిన వారు నిరుపయోగ కార్యక్రమాల్లోకి దిగి, అమూల్యమైన జీవితాల్ని అంతం చేసుకోకుండా చూడ్డం! ఈ అసలు విషయాన్ని వదిలేసి బెదిరింపులకు, నిందాస్తుతులకు దిగడం ఏ రకపు ’మేధావితన’మో పాఠకులే నిర్ణయించుకోగలరు.

’మరణం’ పై కార్ల్ సేగన్ అభిప్రాయాలు:

తన ఉత్తరంలో రోహిత్ “నా జననం ఒక ఘోర ప్రమాదం” అని వ్రాసుకున్నాడు. అతని పుట్టుక ఒక యాక్సిడెంట్ కావొచ్చునేమో గానీ అతని చావు మాత్రం కాదు. ఆ మరణాన్ని తన చేతులారా కొనితెచ్చుకున్నది రోహితుడేనని చెప్పగలను. ఎందుకంటే, కార్ల్ సేగన్ తన 62వ ఏట బోన్ క్యాన్సర్ తో మరణించాడు. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం చివరి కొన్ని నెలల పాటు అతను తీవ్రయాతనను అనుభవించాడు.

1997లో చనిపోవడానికి కొన్ని నెలల ముందు ’పెరేడ్’ అన్న పత్రికకు వ్రాస్తూ ’మరణం’ పట్ల తన అభిప్రాయాల్ని ఇలా వెల్లడించాడు కార్ల్:

“I would love to believe that when I die I will live again, that some thinking, feeling, remembering part of me will continue. But much as I want to believe that, and despite the ancient and worldwide cultural traditions that assert an afterlife, I know of nothing to suggest that it is more than wishful thinking.”

“The world is so exquisite with so much love and moral depth, that there is no reason to deceive ourselves with pretty stories for which there’s little good evidence. Far better it seems to me, in our vulnerability, is to look death in the eye and to be grateful every day for the brief but magnificent opportunity that life provides.”

 

(Source: http://www.csicop.org/si/show/darkened_cosmos_a_tribute_to_carl_sagan/)

కార్ల్ సేగన్ను జీవితాదర్శంగా తీసుకున్న రోహిత్, మరణం పట్ల కార్ల్ చూపించిన తెగువకు విరుద్ధంగా తన ఆఖరు ఉత్తరంలో మరణాన్ని చేజేతులా ఎలా కొనిదెచ్చుకుంటున్నది వ్రాసుకున్నాడు:

May be I was wrong, all the while, in understanding world. In understanding love, pain, life, death. There was no urgency. But I always was rushing. Desperate to start a life. All the while, some people, for them, life itself is curse. My birth is my fatal accident. I can never recover from my childhood loneliness. The unappreciated child from my past.

I am not hurt at this moment. I am not sad. I am just empty. Unconcerned about myself. That’s pathetic. And that’s why I am doing this.

People may dub me as a coward. And selfish, or stupid once I am gone. I am not bothered about what I am called. I don’t believe in after-death stories, ghosts, or spirits. If there is anything at all I believe, I believe that I can travel to the stars. And know about the other worlds.

కార్ల్ సేగన్ అన్న “there is no reason to deceive ourselves with petty stories for which there’s little good evidence” గొప్ప మాటలకు వ్యతిరేకంగా రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడు. నిరాధారాలైన కొన్ని అసత్యాలను సత్యాలుగా నమ్మిన రోహిత్ మరిన్ని అసత్య ప్రచారాలకు పనిముట్టుగా మారిపోయాడు. ఇది నిజంగా విషాదకరం.

ఆర్య-ద్రావిడ సిద్ధాంతం క్రమక్రమంగా వీగిపోతోంది. బాబ్రీ మసీదు కట్టడం క్రింద ప్రాచీన దేవాలయపు అవశేషాలున్నాయన్న నిజం ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తోంది. ఇటీవలే విడుదలయిన సుభాస్ చంద్ర బోస్ రహస్య పత్రాలు మనకు తెలియనివ్వని చరిత్రను తెలియజేస్తున్నాయి. ఇలా ఎన్నెన్నో అసత్యాలు, అర్ధ సత్యాలపై గల ముసుగులు వీడిపోతున్న సమయంలో ఇవేవీ గమనించకుండానే రోహిత్ తొందరపడి వెళ్ళిపోయాడు. ఈ తొందరపాటు తనలో ఉందన్న విషయాన్ని “There was no urgency. But I always was rushing.” అని చెప్పి మరీ వెళ్ళిపోయాడు.

అదే ఉత్తరంలో ’తన బాల్యం ఒంటరితనంతో బాధపడిం’దని రోహిత్ వ్రాసుకున్నాడు. కార్ల్ సేగన్ బాల్యం కూడా అంతేనని అతని జీవిత చరిత్ర చెబుతోంది. యూదులైన తల్లిదండ్రుల్లో తండ్రి దైవచింతన లేని వాడు. తల్లి నిష్టాగరిష్టురాలు. వీరిద్దరి మధ్య బాల సేగన్ బాగా నలిగిపోయాడు. అంతే కాదు 1929 నుండి 1939 వరకు అమెరికాను గడగడలాడించిన ’గ్రేట్ డిప్రెషన్’లో అతని దుర్భర బాల్యం గడించింది. అయినా కూడా కార్ల్ ఓ విజేతగా నిలబడ్డాడు. ఉన్నత విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి ప్రపంచం గర్వించదగ్గ శాస్త్రవేత్త అయ్యాడు. జీవిత చరమాంకంలో ఎముకల క్యాన్సర్ బాధించినా చలించకుండా నిబ్బరంగా నిలచాడు. కానీ రోహిత్ ఎందుకో తన జీవితంలో కార్ల్ సేగన్ ను అనుసరించలేకపోయాడు. ఎందుకో ఉత్తేజాన్ని పొందలేకపోయాడు. అటువంటి వాడు సూయిసైడ్ నోట్‍లో కార్ల్ తన ఆదర్శమని చెప్పుకోవడం ఆదర్శాలు ఆచరణలోకి రాకపోతే ఏమవుతుందో తెలియజేస్తోంది!

ఇది తీవ్రమైన విషాదాన్ని కలిగించే అంశం. రోహిత్ వ్రాసుకున్న ప్రతి అక్షరం వెనుక వయక్తిక దైన్యం ఉంది. ఆత్మగతమైన వేదన ఉంది. ఆ భావనలకు కుల, మత, సిద్ధాంత ముసుగులు తొడగడం అవివేకం. అవకాశవాదం.

రోహిత్ వ్రాసుకున్న చివరి మాటలలో అతను సహాయ హస్తాల కోసం ఎదురు చూస్తున్న తపన కనిపిస్తోంది. అతనికి ’కౌన్సిలింగ్’ తప్పసరిగా అవసరమయింది. కానీ అనవసర రాజకీయాలు అతణ్ణి సహాయం పొందడం నుండి వంచితుణ్ణి చేసాయి.

ఇప్పుడు రోహిత్ ఒక పావు!

అంతే!

రోహిత్ తనకు తానుగా చెప్పుకున్నట్టు “I am rushing” వంటి తొందరపాటు ధోరణుల వల్లనే మరొక కార్ల్ సేగన్ గా మారలేకపోయాడు.

 

కనుక విద్యార్థులకు నేను చేసే మనవి ఏమిటంటే:

 • మీ జీవితాలకు మీరు ఒక్కరే యజమానులు కారు. మీకొక్కరికే బాధ్యతలు లేవు.
 • మీపై ఆధారపడిన తల్లిదండ్రులు, తోబుట్టువులు ఉన్నారు. మీ జీవితాలపై వారికీ కొన్ని అధికారాలతో బాటు ఆశయాలు, ఆకాంక్షలు ఉంటాయి.
 • దయచేసి కళాశాలల్ని, యూనివర్సిటీలను రాజకీయ జీవితపు ఆరంగేట్రం వేదికలుగా చూడకండి.
 • మీ చుట్టుప్రక్కల జరిగే పరిణామాల్ని గమనించండి. గళం విప్పండి. కానీ ఆవేశ కావేశాలలో జీవితాల్ని ముగించే విధంగా వ్యవహరించకండి.
 • రోహిత్‍పై కవిత్వ సంకలనాలు వస్తే చదవండి. కానీ కీర్తిప్రతిష్టలకు ఆత్మహత్య మార్గం కాదని మాత్రం గుర్తుంచుకోండి.
 • హత్య, ఆత్మహత్య – రెండూ చట్టపరంగా్ను, నైతికంగాను, ఆధ్యాత్మిక పరంగానూ తీవ్రమైన నేరాలని గుర్తుంచుకోండి.
 • చనిపోయే నాటికి కార్ల్ సేగన్ వయసు 62, రోహిత్ వయసు 26 సంవత్సరాలని మర్చిపోకండి.
 • మీకు 18 ఏండ్లకే ఓటు హక్కు వచ్చివుండవచ్చు గాక కానీ అన్ని సమస్యలపై తీర్మానాలనివ్వగలిగే అనుభవం, పరిణితి, సామర్థ్యం పూర్తిగా రాలేదని తెలుసుకోండి.
 • రోహిత్ మరణం యూనివర్సిటీ రాజకీయాలను కలుపుకుని అన్ని రకాల రాజకీయాలకు ఓ చెంపపెట్టువంటిదని గ్రహించండి. దాని నుండి గుణపాఠాల్ని నేర్చుకోండి.
 • దారి తప్పించడమే బ్రతుకుతెరువుగా జీవించే అసాంఘిక శక్తుల నుండి, చావులకై ఎదురు చూసే కుహనా సాహిత్యకారుల నుండి, సంచలనమే ఊపిరిగా బ్రతికే మీడియా నుండి జాగురూకులై మెలగండి.
 • ఉద్రేకంపై పట్టు, విద్యార్జనపై దృష్టి, పరిశోధనలో మమైకమై లక్ష్యాన్ని సాధించిన తరువాత మీకు నచ్చిన ’ఇజం’ తరఫున వకాల్తా పుచ్చుకోండి. అంతేగానీ మొగ్గలోని రాలిపోకండి.
 • ఎలా చనిపోవాలనడానికి కాదు ఎలా జీవించాలనడానికి కాలం నేర్పిన గట్టి పాఠంగా రోహిత్ ఘటనను గ్రహించండి.

 

విజ్ఞానేనాత్మానాం సంపాదయేత్”

“సంపాదితాత్మా జితాత్మా భవతి”

“జితాత్మా సర్వార్థైః సంయుజ్యతే”

విద్యావంతుల వద్ద విజ్ఞానాన్ని సంపాదించాలి. దీనినే ఆత్మసంపాదన అంటారు.

ఆ సంపాదన చేసినవారు అనర్థదాయకాలైన ఆవేశాలను, ఆక్రోశాలను, ద్వేషాన్ని జయించినవారవుతారు.

అటువంటి జితాత్ములు తమ అర్థాన్ని సాధించడమే కాదు మొత్తం సమాజానికి కూడా ఉపయోగపడతారు.

(చాణక్యుడు)

శాంతిః శాంతిః శాంతిః

*****

 

Comments   

 
+2 #3 కార్ల్ సేగన్ కావాలంటే… Saikiran Kumar Kondamudi 2016-02-12 06:07
Best article, I have read ever since Rohit's issue.
Great job annagaaru.
Simply fantastic analysis.
Quote
 
 
+5 #2 కార్ల్ సేగన్ కావాలంటే… Srikanth 2016-02-07 14:08
After reading so many ridiculous articles on Rohit, I gave up on India that rhetoric and emotions drive the thought process rather than calm and cool logic. Thanks for your article, there seems to be an ounce of gray matter still left in media. Keep up the good work.
Quote
 
 
+4 #1 కార్ల్ సగాన్ కావాలంటే… IVNS 2016-02-06 07:56
//కార్ల్ వ్యక్తిగతంగా అజ్ఞేయవాది అట! కానీ ప్రపంచం అతన్ని నాస్తికునిగా పిలిచింది. అతనే చెప్పుకున్నట్టు గా కార్ల్ ఒక ’సంశయవాది.’ సంప్రదాయం చెప్పే ప్రతి అంశాన్నీ అనుమానించి, హేతువాద పునాదిపై విమర్శించడం అతనికి అలవాటు. కానీ నేను చదివిన మూడు పుస్తకాల్లో అతని విమర్శ ఎక్కడా హద్దులు మీరలేదు.
మయన్ నాగరికత, భారతీయ సంస్కృతి, మీసోఅమెరికన్ సమాజాలు – ఇవేవీ కూడా అతని పుస్తకాల్లో హేళను గురి కాలేదు. బదులుగా, అవన్నీ కార్ల్ సేగన్ విశ్లేషణతో కొత్త రంగుల్ని సంతరించుకున్నాయ ి// I think the youth in our Telugu States must read this. I shall try to share with as many as possible.
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh