Articles

User Rating:  / 0
PoorBest 
లాలూలు చిదంబరాలు
ప్రణబ్లు శరద్ పవార్లు
రేఖలు జయబాధుర్లు
జయప్రదలు విజయశాంతులు
పండగ చేసుకున్నారీ వేళ
 
ఇంతలో కొత్తగా వచ్చాడు సచిన్
అంతకు ముందే ఉన్నాడు అజహరుద్దీన్
 
పార్లమెంటు కేంటీన్ లో అరవై ఏళ్ల రుచులు
కొసరి కసరి వడ్డించారు అందరకూ
ముఖ్యంగా పాత్రికేయులకు
బాగా తిని బాగా రాస్తారని
 
అరవై ఏళ్ల పార్లమెంటు ఖర్చు కనీసం
అరవై వేల   భారతీయుల
అగచాట్లు తీర్చిందో పెంచిందో
అడిగి మాత్రం ప్రయోజనం లేదు కాని
అందరికీ తెలుసు అరవైల వరకూ మినహాయిస్తే
అందరూ గత ఏభై ఏళ్లలో ఏమ్పీలై బీదోళ్ళుగా మిగలలేదు
 
ఎంపీ కావాలంటే
ఎంత కావాలో మాత్రం
ఎవర్ని అడిగినా ఈ అరవై ఏళ్లలో
ఎంచక్కా తెలిసిపోద్ది
 
పార్లమెంటు షష్టి పూర్తి పీటలపై
పారదర్శకంగా సోనియా రాజీవుని
పుత్తడి ప్రతిమతో కూర్చొని
లౌకిక పురోహితుడు కాకి అరుపులను
కూడా చేర్చి అన్ని దేశ భాషలలో
చదివే మంత్రోచ్ఛారణ మధ్య
పరమ పవిత్రంగా జరిగి పోయింది


Comments   

 
+1 #1 RE: పార్లమెంటుకు షష్టిపూర్తి IVNS 2012-05-17 09:27
ఈనెల 13 వ తారీఖున ఇది వ్రాస్తే మన పాలక వర్గం ఎం పీలు నిన్నే వారికి పార్లమెంటు పై ఎంత గౌరవం ఉందొ చప్పక చెప్పరు
హిందూ పేపరు వారు ఈ విషయాన్నే మొదటి పేజి లో ఈనాడు ప్రముఖం గా బొమ్మ వేసి మరీ నిరూ పించారు. ఆవకాయ పాఠకులు చదివే ఉంటారు.
అదన్న మాట.
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh