The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 23
PoorBest 

మూడు దశాబ్దాల సినిజీవితంలో, దాదాపు రెండు దశాబ్దాలు చిరంజీవి ఆడిందే ఆటగా, పాడిందే పాటగా, చేసిందే డాన్సుగా తెలుగు వెండితెర వెలుగులు చిమ్మింది. రెండు సంవత్సరాల రాజకీయ జీవితం మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధంగా ముగిసింది. రఫ్ఫాడించేస్తానన్న చిరంజీవి ఇప్పుడు హస్తం పార్టీతో చేతులు కలిపేసాడు. ఇంతవరకూ, ఎవరి విశ్లేషణలు వారు చేసుకొని, చివరికి చిరంజీవి ప్రజాదోహ్రం చేసాడని ఆరోపిస్తున్నాయి అన్ని పార్టీలు.

Chiruవిచిత్రం ఏమిటంటే, గత ఎన్నికలలో గెలుచుకుంది 18 అసెంబ్లీ సీట్లే అయినా, 16 శాతం వరకు ఓట్లను చీల్చగలిగింది ప్రజారాజ్యం. తను బాగుపడిందేదీ లేకపోయినా, మా పొట్టలను కొట్టింది ఈ ప్రజారాజ్యం అని అప్పట్లో చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిలు వాపోయారు కూడా. సామాజిక న్యాయమే పరమార్ధంగా పెద్దయెత్తున మొదలైన ప్రజారాజ్యం ఈరోజు చతికిలపడటానికి కారణం ఏమిటి? రాజకీయ పరిణతి లేని చిరంజీవా? వ్యాపారంతో రాజకీయాలు చేయాలనుకుని ఒంటెద్దు పోకడలతో పార్టీని నడిపిన బావమరిదా? ఉన్న పార్టీలలో ఉనికి ఏమాత్రమూ లేకపోయినా, పదవుల కోసం ప్రజారాజ్యంలోకి పాక్కుంటూ వచ్చిన పాత నాయకులా?

 

ఈ సందర్భంగా చిరంజీవి ప్రజారాజ్యాన్ని, అప్పటి ఎన్ టి ఆర్ తెలుగుదేశంతో సరిపోల్చటం తప్పు కాదు. అప్పటి రాజకీయాలలోని శూన్యత, ప్రత్యామ్నాయంలేని పార్టీగా కాంగ్రెస్ కొనసాగించిన దుష్పరిపాలన నేపధ్యంలో "తెలుగువాడి ఆత్మగౌరవం" ఒక నినాదమై సహజంగానే ప్రజలను ఆకర్షించింది. నిర్లిప్తంగా నిర్వికారంగా నిద్రాణమై ఉన్న తెలుగుజాతి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది.

ఎన్ టి ఆర్ సామాజిక న్యాయమంటూ నంగి మాటలు మాట్లాడలేదు. తెలుగుజాతి ఆత్మగౌరవమంటూ గర్జించాడు. కొత్త రాజకీయాలంటూ దిక్కులు చూడలేదు, రాత్రికి రాత్రి కొత్త నాయకులను తయారుచేసాడు. ఎన్నికలలో వారికి దన్నుగా తాను నిలిచాడే కానీ, వారి డబ్బుతో తాను నుంచోలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను పెకిలించివేయాలనే లక్ష్యంతో, స్థిరచిత్తంతో అడుగులు వేసాడే కానీ, ఒకడుగు ముందుకువేసి రెండు అడుగులు వెనక్కు తగ్గే తరహాలో కాదు.N.T. Ramarao, Telugudesm Founder

 

ఎన్ టీ ఆర్ కు పూర్తి విరుద్ధమైన తరహాలో చిరంజీవి రాజకీయ ప్రస్థానం కొనసాగింది. ఏ ప్రశ్నకైనా, కప్పదాటు సమాధానాలే కానీ, ఖచ్చితమైన సమాధానం ఏనాడు చిరంజీవి ఇవ్వలేదు. తన పార్టీవారే, తననే తిట్టిపోస్తున్నా, తమలో తామే కోట్లాడుకుంటున్నా ఒక సామాన్య ప్రేక్షకుడిలా దిక్కులు చూసాడే కానీ, ఒక నాయకుడుగా దిశానిర్దేశం చేయలేకపోయాడు. రాజకీయ అవగాహన, విషయ పరిజ్ఞాన లేమి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది.

 

చిరంజీవిని ఒక సాధారణ నాయకుడిగా మాత్రమే గమనిస్తే, ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేయటం "ప్రాప్తకాలజ్ఞత"గా కనిపిస్తుంది. ఒక దశాబ్దంపైగా రాష్ట్ర రాజకీయాలని ప్రభావితం చేసిన ఎన్ టి ఆర్ కు చివరిలో పట్టిన గతి, తనకు రెండు సంవత్సరాలలో పట్టకూడదని ఆయన నిర్ణయించుకున్నట్లు ఖచ్చితంగా తెలుస్తుంది. 16 శాతం ఓట్లు వచ్చినా, దక్కింది 18 సీట్లే. పదవుల కోసం వేరే పార్టీలను వదిలి వచ్చిన నేతలు, పదవుల కోసం పార్టీని చీల్చగలరని అర్ధమయ్యుంటుంది. అసెంబ్లీలో ఏమాత్రమూ అవకాశం లేకపోయినా, నాదెండ్ల భాస్కర రావును ఎగదోసి, ఎన్ టి ఆర్ ను దించటానికి ప్రయత్నించిన కాంగ్రెస్, రేపు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కాపాడుకోటానికి ప్రజారాజ్యాన్ని కూడా చీల్చగలదని చిరంజీవి నమ్మి ఉంటారు.

ఏదేమైనా, వెండి తెర మీది అసాధారణ నాయకుడు ఒక సాధారణ నేతలానే తన శేష రాజకీయ జీవితాన్ని గడపాలని నిర్ణయించుకోవటం ఆయన అభిమానులకు ఏమాత్రం రుచిస్తుందో!

Comments   

 
0 #11 web developer venu 2013-03-03 17:19
ప్రజలు ఎప్పటికి మారారు కాబట్టి అయన మారారు అందులో పెద్ద విసేసం లేదు. కనీసం మల్లి వచ్చే ఎన్నికలలోపల ఈయన మరొక పార్టీ లోకి దుకతమో లేక రాజకీయ సన్యాసం చేయకుండా ఉన్నాడు అంటే అది అద్భుతమే . .
వేణు
www.seodeveloper.in
Quote
 
 
0 #10 chiru mln 2012-11-18 15:08
chiru has no alternative. otherwise by this time, jagan might have bribed all these mlas and would have threatened the congress parties. it is a double bonanza for congress. they did not get negative vote.they got 17 positive votes. the effect is 34 seats. regarding ministry in centre, he deserves the same for the help he has done. please question all other politicians who also have done like this. andhra people have not given him a chance.
Quote
 
 
+2 #9 RE: చిరంజీవి కాదు ఓ "చిరు జీవి" Srinivas Vangala 2011-09-12 16:10
Chiranjeevi is the dumbest person I have ever seen or will ever see. How did he even assume that he can lead a political party just because he wore horrible clothes and danced on the screen? This assumption itself shows that there is nothing between his ears.Totally lacking in grey matter. And to top hat,he made a fool of himself whenever he opened his mouth.What a joker!
Quote
 
 
-2 #8 RE: చిరంజీవి కాదు ఓ "చిరు జీవి" Raghothama Rao 2011-06-28 07:12
Quoting kiran kumar:
vaastavaalanu grahinchandi, dabbu dochukone naayakula kante better chiru.


The point here is that Chiru has joined hands with such a party which has become care of address for notorious money mongers!
Quote
 
 
-3 #7 dont be foolish kiran kumar 2011-06-27 05:31
vaastavaalanu grahinchandi, dabbu dochukone naayakula kante better chiru.
Quote
 
 
+2 #6 RE: చిరంజీవి కాదు ఓ "చిరు జీవి" Raghothama Rao 2011-06-03 05:14
Quoting Ravi:
He started the party when there was no political vacuum in the State. Had he started the party at this time, probably he would have succeeded.


True.
Quote
 
 
+2 #5 Wrong Timing Ravi 2011-06-03 04:49
He started the party when there was no political vacuum in the State. Had he started the party at this time, probably he would have succeeded.
Quote
 
 
0 #4 RE: చిరంజీవి కాదు ఓ "చిరు జీవి" damdoose 2011-05-24 12:45
politics lo this fellow is a big joker
Quote
 
 
+2 #3 RE: చిరంజీవి కాదు ఓ "చిరు జీవి" Raghothama Rao 2011-02-22 11:23
లోక్ సత్త లాంటి పార్టీ తన భావజాలానికి కట్టుబడి ఇంకా పనిచేస్తుంటే, ధూమ్ ధామ్ గా మొదలైన మెగా పార్టీ రెండేళ్ళలోనే మాయమైపోవడం ఆశ్చర్యం.


మొదలుపెట్టినప్పటి ఉత్సాహం ఇరవైనాలుగు నెలల్లోనే నీరుకారడం చూస్తుంటే ఆ పార్టీ నాయకుల ఉద్దేశాలను అనుమానించాల్సిం దే!
Quote
 
 
+2 #2 RE: RE: చిరంజీవి కాదు ఓ 'చిరు జీవీ IVNS 2011-02-22 10:49
Chiranjeevi is still acting as a politician. Old habits die hard. prajarajyam is his Khaidi and and his joining congress is his Rustum
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh